India: భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కు వర్షం పోటు.. నిలిచిపోయిన ఆట

  • మాంచెస్టర్ లో ప్రత్యక్షమైన వరుణుడు
  • 47 ఓవర్లో మ్యాచ్ నిలిపివేత
  • టీమిండియా స్కోరు 305/4

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ లో వరుణుడి ప్రభావం లేని మ్యాచ్ చాలా అరుదైన విషయంగా మారింది. ఇవాళ్టి భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కు కూడా వర్షం కారణంగా అంతరాయం కలిగింది. టీమిండియా బ్యాటింగ్ చేస్తుండగా 47వ ఓవర్ లో 4 బంతులు పడిన తర్వాత వర్షం రావడంతో ఆట నిలిపివేశారు. అప్పటికి భారత్ స్కోరు 4 వికెట్లకు 305 పరుగులు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 71, విజయ్ శంకర్ 3 పరుగులతో ఆడుతున్నారు.

అంతకుముందు, సెంచరీ సాధించిన రోహిత్ శర్మ 140 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హసన్ అలీ బౌలింగ్ లో అవుటయ్యాడు. హార్దిక్ పాండ్య 19 బంతుల్లో 26 పరుగులు చేయగా, ధోనీ 1 పరుగుకే వెనుదిరిగి తీవ్రంగా నిరాశపరిచాడు. పాక్ బౌలర్లలో అమీర్ కు 2 వికెట్లు దక్కాయి. ఒకవేళ భారత్ ఇన్నింగ్స్ ను ఇంతటితో ముగించినట్టయితే డక్ వర్త్ లూయిస్ విధానం ప్రకారం పాక్ లక్ష్యం 46 ఓవర్లలో 327 పరుగులుగా నిర్దేశంచే అవకాశం ఉంది!

More Telugu News