TRS: టీఆర్ఎస్ నీచ రాజకీయాలకు పాల్పడుతోంది: టీ-కాంగ్రెస్ నేత ఉత్తమ్

షార్ట్స్‌లో చూడండి
టీఆర్ఎస్ పై టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విరుచుకుపడ్డారు. సూర్యాపేటలో మీడియాతో ఆయన మాట్లాడుతూ,  టీఆర్ఎస్ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. పోలీసులను అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నేతల జోలికొస్తే సహించేది లేదని హెచ్చరించారు. హూజూర్ నగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఇన్నేళ్లుగా చేసిందేమీ లేదని విమర్శించారు.
Go Back to Shorts
TRS
T-congress

More Telugu News