fathers day: అంతర్జాతీయ పితృ దినోత్సవం.. హరికృష్ణను గుర్తుచేసుకుని కుమార్తె నందమూరి సుహాసిని భావోద్వేగం!

  • నాన్న అంటే ఓ ధైర్యం.. నాన్న అంటే ఓ భరోసా
  • పిల్లలే సర్వస్వంగా ఆయన బతుకుతాడు
  • ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ నేత

నాన్న అంటే ఓ ధైర్యం, ఓ భరోసా అని టీడీపీ నేత నందమూరి సుహాసిని తెలిపారు. అన్నింటికి మించి నాన్న అంటే త్యాగానికి మారుపేరని వ్యాఖ్యానించారు. తండ్రి కన్నబిడ్డలే సర్వస్వంగా బతుకుతాడని అన్నారు. అంతర్జాతీయ పితృ దినోత్సవం సందర్భంగా ఈరోజు సుహాసిని స్పందిస్తూ..‘నాన్నంటే ఓ ధైర్యం.. నాన్నంటే బాధ్యత.. ఓ భద్రత, భరోసా.. అన్నింటికీ మించి త్యాగానికి మారుపేరు నాన్న.

కన్నబిడ్డలే జీవితంగా బతుకుతాడు. జీవితాంతం పిల్లలను తన గుండెలపై మోస్తాడు. వాళ్ల సుఖం కోసం రక్తం చిందిస్తాడు. ఈ క్రమంలో తన అవసరాలు, ఆరోగ్యం అన్నింటినీ పక్కనబెడతాడు’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తండ్రి నందమూరి హరికృష్ణతో దిగిన ఫొటోను సుహాసిని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

More Telugu News