Bollywood: మహిళల కోసం స్వచ్ఛంద సంస్థను ప్రారంభించిన షారుక్ ఖాన్!

  • మీర్ ఫౌండేషన్ గా నామకరణం
  • వెబ్ సైట్ ఆవిష్కరించిన కింగ్ ఖాన్
  • మహిళా సాధికారతకు కృషి చేస్తానని వ్యాఖ్య
అంతర్జాతీయ పితృ దినోత్సవం వేళ బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కష్టాల్లో ఉన్న మహిళలకు సాయం చేసేందుకు తన తండ్రి ‘మీర్ తాజ్ మొహమ్మద్ ఖాన్’ పేరిట ఓ ఫౌండేషన్ ను ప్రారంభించారు. దీనికి మీర్ ఫౌండేషన్ గా నామకరణం చేశారు.

అంతర్జాతీయ పితృ దినోత్సవం సందర్భంగా ఫౌండేషన్ వెబ్ సైట్ ను షారుక్ ఖాన్ ఆవిష్కరించారు. కుటుంబ కలహాలు, న్యాయ సహాయం, వైద్యం తదితర రంగాల్లో మహిళలకు తమ ఫౌండేషన్ సహాయసహకారాలు అందిస్తుందని కింగ్ ఖాన్ తెలిపారు. తన తండ్రి స్ఫూర్తితో మహిళా సాధికారతకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ మేరకు షారుక్ ఖాన్ ట్విట్టర్ లో స్పందించారు.
Bollywood
sharukh khan
meer foundation
Twitter
website

More Telugu News