India: మాంచెస్టర్ లో ఆగిన వర్షం... మైదానానికి చేరుకున్న కోహ్లీ టీమ్!

  • నీటిని తోడేందుకు శ్రమిస్తున్న గ్రౌండ్ స్టాఫ్
  • వర్షం కురవకుంటే సమయానికే మ్యాచ్
  • ఆట మధ్యలో వర్షం కురిసే అవకాశం
కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని చూస్తున్న భారత్, పాక్ మధ్య మ్యాచ్ కి సమయం ఆసన్నమైంది. ఈ వరల్డ్ కప్ పోటీల్లోనే అత్యంత ఆసక్తిగా సాగుతుందని భావిస్తున్న ఈ దాయాదుల పోరును వరుణుడు అడ్డుకునే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించినా, గత రెండు గంటలుగా ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో వర్షం కురవకపోవడం గమనార్హం. దీంతో గ్రౌండ్ స్టాఫ్ తీవ్రంగా శ్రమిస్తూ, మైదానం నుంచి నీటిని తోడే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ ఉదయం వరకూ 10 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రత, ఇప్పుడు 15 డిగ్రీలకు చేరుకుంది. మ్యాచ్ సమయానికే ప్రారంభమైనా, మధ్యలో ఒకటి, రెండు సార్లు వర్షం పడవచ్చని, ఉరుములు, మెరుపులు కూడా రావచ్చని తెలుస్తోంది. మరో రెండు గంటల పాటు వర్షం కురవకుంటే, సమయానికి మైదానాన్ని సిద్ధం చేస్తామని గ్రౌండ్ స్టాఫ్ అంటోంది. మరోవైపు ఇరు జట్లూ హోటల్ కు చేరుకున్నాయి. అప్పటికే మైదానం వద్దకు భారీ ఎత్తున చేరుకున్న భారత క్రికెట్ అభిమానులు కోహ్లీ సేనకు స్వాగతం పలికారు. భారత్ విజయం సాధిస్తుందన్న నమ్మకం తమకుందంటూ 'జీతేగా భయ్ జీతేగా... ఇండియా జీతేగా' అంటూ నినాదాలు చేశారు. 
India
Pakistan
Manchester
Old Traford
Rain
Cricket

More Telugu News