Andhra Pradesh: మంత్రిగా మోపిదేవి బాధ్యతల స్వీకరణ .. 9 లక్షల మంది రైతులకు లబ్ధి కలిగేలా తొలి నిర్ణయం!

  • నేడు అమరావతిలో బాధ్యతల స్వీకరణ
  • లీటర్ పాలుపై చెల్లింపు మరో రూ.4కు పెంపు
  • ప్రభుత్వంపై రూ.220 కోట్ల అదనపు భారం

ఆంధ్రప్రదేశ్ లో పాడిపరిశ్రమ, మత్స్య పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తానని ఏపీ పశుసంవర్థక-మత్సశాఖ, మార్కెటింగ్ శాఖ మంత్రి, వైసీపీ నేత మోపిదేవి వెంకటరమణ తెలిపారు. పాడి రైతులను ఆదుకునేందుకు లీటర్ పాలకు చెల్లిస్తున్న మొత్తాన్ని మరో రూ.4 పెంచుతున్నామని వెల్లడించారు. దీనివల్ల ప్రభుత్వంపై అదనంగా రూ.220 కోట్ల భారం పడుతుందని చెప్పారు.

మోపిదేవి వెంకటరమణ ఈరోజు సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం రైతుల నుంచి పప్పు ధాన్యాల కొనుగోలుకు రూ.100 కోట్లు విడుదల చేసే ఫైలుపై మోపిదేవి తొలి సంతకం చేశారు. లీటర్ పాలపై ప్రభుత్వం చెల్లిస్తున్న మొత్తాన్ని రూ.4 మేర పెంచడం ద్వారా 9 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని మంత్రి తెలిపారు.

More Telugu News