Prudhviraj: జగన్ ఇంత భారీ మెజారిటీతో గెలిచినా సినీ పెద్దలకి కనబడలేదు: పృథ్వీ మండిపాటు

  • సినిమా వాళ్లను ఎప్పుడూ నమ్మొద్దు
  • నరసరావుపేటలో కోడెల ట్యాక్స్ తో వ్యాపారులు నష్టపోయారు
  • గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 30 ఏళ్లపాటు వైసీపీ జెండా ఎగురవేయడం ఖాయం
సినీ నటుడు, వైసీపీ నాయకుడు పృథ్వీ రాజకీయ స్థితిగతులపై వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకున్న నేత జగన్ అని, ఆయన ఏపీని పాతికేళ్లపాటు పరిపాలిస్తారని ధీమా వ్యక్తం చేశారు. జగన్ ఇంతటి ప్రభంజనం సృష్టించి, తిరుగులేని విజయం సాధించినా తెలుగు సినీ పెద్దలకు కనిపించకపోవడం శోచనీయం అని పృథ్వీ అసంతృప్తి వ్యక్తం చేశారు. సినిమా వాళ్లను నమ్మకూడదని చెప్పేది ఇందుకేనని అన్నారు.

ఇక, నరసరావుపేట నియోజకవర్గం గురించి మాట్లాడుతూ, అక్కడి వ్యాపారులంతా 'కోడెల ట్యాక్స్' తో తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో వైసీపీ తరఫున విజయం సాధించిన శాసనసభ్యుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరో మూడు దశాబ్దాల పాటు నరసరావుపేట కోటలో వైసీపీ జెండాను ఘనంగా ఎగురవేస్తారని పృథ్వీ నమ్మకం వ్యక్తం చేశారు.
Prudhviraj
Tollywood
Jagan
YSRCP

More Telugu News