Virat Kohli: మొదటిసారి ఆడుతున్న వాళ్లు కాస్త కంగారు పడతారేమో!: భారత్-పాక్ పోరుపై కోహ్లీ వ్యాఖ్యలు

  • జూన్ 16న భారత్-పాకిస్థాన్ మ్యాచ్
  • అందరి దృష్టి దాయాదుల సమరంపైనే
  • ఇలాంటి పోరులో తలపడడం గౌరవంగా భావిస్తామన్న కోహ్లీ
వరల్డ్ కప్ లో ఎన్ని మ్యాచ్ లు జరిగినా భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కు దీటుగా నిలిచేవి చాలా తక్కువ. ఈసారి ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో కూడా అందరి దృష్టి దాయాదుల సమరంపైనే ఉంది. భారత్, పాకిస్థాన్ జట్లు జూన్ 16న లీగ్ మ్యాచ్ లో తలపడనున్నాయి. దీనిపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు.

ఇండో-పాక్ మ్యాచ్ లో మొదటిసారి ఆడుతున్న ఆటగాళ్లకు ఈ ఉద్విగ్నభరిత వాతావరణం కంగారు పుట్టిస్తుందని అన్నాడు. కానీ తనతో పాటు కొందరు అనుభవజ్ఞులు పక్కా ప్రొఫెషనల్స్ అని, తమ నైపుణ్యాల ప్రదర్శనకు వేదికగా ఈ మ్యాచ్ ను పరిగణిస్తామని తెలిపాడు. ఇలాంటి మ్యాచ్ లో పాల్గొనడం గౌరవంగా భావిస్తామని కోహ్లీ చెప్పాడు. న్యూజిలాండ్ తో మ్యాచ్ రద్దయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు.
Virat Kohli
India
Pakistan

More Telugu News