Andhra Pradesh: ఏపీకి ‘ఉపాధి హామీ’ పెండింగ్ నిధులు విడుదల

  • పెండింగ్ లో ఉన్న మొత్తం నిధులు రూ.2,500 కోట్లు
  • అందులో రూ.708.65 కోట్లు విడుదల 
  • కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
ఏపీకి రావాల్సిన గ్రామీణ ఉపాధి హామీ పథకం పెండింగ్ నిధులు విడుదలయ్యాయి. ఈ పథకానికి సంబంధించి ఏపీలో చేపట్టిన పనులకు గాను రాష్ట్రానికి రావాల్సిన మొత్తం నిధుల్లో రూ.708.65 కోట్లను విడుదల చేస్తూ కేంద్రం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, గత ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు సంబంధించి యూసీలను ఎప్పటికప్పుడు జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రికి చంద్రబాబు హయాంలో మంత్రులు, ఎంపీలు అందజేశారు. ‘ఉపాధి హామీ’ కింద ఏపీకి రావాల్సిన నిధులు రూ.2,500 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి.  
Andhra Pradesh
Employment Gurantee scheme

More Telugu News