TRS: టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కె.కేశవరావు.. నామాకు కీలక పదవి

  • రాజ్యసభలో టీఆర్ఎస్ పక్ష నేతగా కేకే
  • లోక్ సభలో టీఆర్ఎస్ పక్ష నేతగా నామా నాగేశ్వరరావు
  • పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం
టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా, రాజ్యసభలో టీఆర్ఎస్ పక్ష నేతగా కె.కేశవరావును, లోక్ సభలో టీఆర్ఎస్ పక్ష నేతగా నామా నాగేశ్వరరావును ఎన్నుకున్నారు. ఈరోజు జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో పార్టీకి చెందిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో కేసీఆర్ భేటీ అయ్యారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు ఈ సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
TRS
nama nageswar rao
keshava rao

More Telugu News