Chandrababu: అప్పట్లో నాలుగు రోజులకే రాజశేఖరరెడ్డి పార్టీ మారారు: చంద్రబాబు

  • టీడీపీ పార్టీ ఫిరాయింపులకు పాల్పడిందన్న జగన్
  • రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలుపొందిన వైయస్.. కాంగ్రెస్ లో చేరారన్న చంద్రబాబు
  • చరిత్రను ఎవరూ మార్చలేరంటూ వ్యాఖ్య
గత ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులకు పాల్పడిందని... తాను అదే పని చేస్తే టీడీపీలో ఎవరూ మిగలరంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు మండిపడ్డారు. 1975లో తాను, రాజశేఖరరెడ్డి ఇద్దరం ఒకేసారి శాసనసభకు ఎన్నికయ్యామని... రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచిన రాజశేఖరరెడ్డి నాలుగు రోజులకే కాంగ్రెస్ పార్టీలో చేరారని ఎద్దేవా చేశారు. అప్పుడు మీ తండ్రి చేసింది కూడా తప్పేనని ఒప్పుకోవాలని అన్నారు. చరిత్రను ఎవరూ మార్చలేరని చెప్పారు. తొలి ప్రసంగంలోనే ప్రతిపక్షాన్ని అడుగడుగునా కించపరిచే విధంగా జగన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. అధికారపక్షమైనా, ప్రతిపక్షమైనా ప్రజలు ఇచ్చిన స్థానమేనని అందరూ గుర్తుంచుకోవాలని అన్నారు.
Chandrababu
ysr
jagan

More Telugu News