Kerala: చిరుతపులిని వెంటాడి, వేటాడి చంపిన వీధికుక్కలు.. వీడియో వైరల్!

  • కేరళలోని కాల్పెట్టాలో ఘటన
  • జనావాసాల్లోకి వచ్చిన చిరుత
  • చుట్టుముట్టి దాడిచేసిన 10 శునకాలు
ప్రతీకుక్కకు ఓ రోజు వస్తుందన్నది సామెత. ఈ సామెతకు సరిపోయే ఘటన కేరళలోని కాల్పెట్టాలో చోటుచేసుకుంది. కారణమేంటో తెలియదు కానీ  ఓ చిరుతపులి కాల్పెట్టాలోని జనవాసాల్లోకి వచ్చేసింది. అంతే, చిరుతను చూసి వీధి కుక్కలు రెచ్చిపోయాయి. దాన్ని చుట్టుముట్టి పిచ్చిపిచ్చిగా కొరికేశాయి. 10 శునకాలు చుట్టుముట్టడంతో కొద్దిసేపు చిరుత వాటి నుంచి తప్పించుకునేందుకు పోరాడింది.

అయినా ఫలితం లేకపోయింది. 10 కుక్కలు మీద పడి కరవడంతో రక్తం చిందిస్తూ అది కిందపడిపోయింది. అయితే శునకాలు వెనక్కి తగ్గకుండా దానిపై దాడిచేస్తూనే ఉన్నాయి. చివరికి చిరుతపులి చనిపోయే వరకూ కరుస్తూనే ఉన్నాయి. ఈ ఘటనను ఓ వ్యక్తి ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగిందన్న విషయమై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.
Kerala
cheeta
haunted
stray dogs
10 dogs
killed
leopard
Viral Videos

More Telugu News