KCR: పోడు రైతుల ప్రయోజనాల కోసం సీతక్క పోరు

  • గ్రామాలను ఖాళీ చేయించే అవకాశం ఉంది
  • ముందస్తుగా ప్రజలను చైతన్యం చేస్తున్నాం
  • హక్కుల్ని తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నాయన్న సీతక్క

కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ సుప్రీంకోర్టు తీర్పును అడ్డు పెట్టుకుని అడవుల్లో ఉన్న గ్రామాలను ఖాళీ చేయించే అవకాశమున్నందున ముందస్తుగా ప్రజలను చైతన్యం చేస్తున్నామని ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. పోడు రైతుల ప్రయోజనాల కోసం ఆమె పోరు బాట పట్టారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు పోడు భూములకు పట్టాలు కల్పిస్తామని చెప్పిన కేసీఆర్, దానికి సంబంధించిన కార్యాచరణ నేటికీ చేపట్టలేదన్నారు.

2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల కోసం అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చి సాగులో ఉన్న భూములకు హక్కు పత్రాలు ఇచ్చే అధికారాన్ని తీసుకువచ్చిందన్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ హక్కుల్ని మంటగలిపే ప్రయత్నం చేస్తున్నాయని సీతక్క విమర్శించారు. పోడు రైతులకు ఇప్పటికైనా హక్కులు కల్పించాలని కేసీఆర్ ని డిమాండ్ చేశారు.

More Telugu News