ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా: జగన్
- 'పెద్దల సభలో తెలుగు పెద్ద' పుస్తకాన్ని ఆవిష్కరించిన జగన్
- సినారె పార్లమెంటు ప్రసంగాలపై పుస్తకం
- పుస్తకాన్ని రచించిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ఈ పుస్తకాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించడాన్ని తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. సినారే కవితలు, మాటల గురించి తను చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారు. తనకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. 1997లో రాజ్యసభకు సినారె నామినేట్ అయ్యారు. ఆరేళ్ల పాటు ఆయన ప్రశ్నలు, చర్చలు, ప్రస్తావనలు, ప్రసంగాలు అందరి మన్ననలను అందుకున్నాయి.