Andhra Pradesh: రాళ్లపాడు ప్రాజెక్టు దగ్గర వైసీపీ ఎమ్మెల్యే, రైతుల ఆందోళన.. ఫోన్ చేసి మాట్లాడిన సీఎం జగన్!

  • అక్రమ పైప్ లైన్ల నిర్మాణంపై కందుకూరు ఎమ్మెల్యే ధర్నా
  • ఆ జీవోను రద్దుచేస్తామని హామీ ఇచ్చిన జగన్
  • ఆందోళన విరమించిన రైతులు, వైసీపీ శ్రేణులు

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద ఈరోజు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టు నుంచి నెల్లూరులోని చింతలదీవిలో కామధేనువు పశువుల పునరుత్పత్తి కేంద్రానికి నీరు అందించేందుకు అక్రమంగా నిర్మిస్తున్న పైపులను తొలగించాలని కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డి ఆందోళనకు దిగారు. ఆయన వెంట భారీ సంఖ్యలో రైతులు, వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు.

దీంతో ప్రాజెక్టు వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. చివరికి ఈ విషయం ఏపీ ముఖ్యమంత్రి జగన్ దృష్టికి వెళ్లడంతో మొత్తం ఘటనపై ఆరా తీశారు. వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం ఈ విషయమై మహిధర్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడిన సీఎం.. సంబంధిత జీవోను రద్దుచేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కందుకూరు ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి, రైతులు ఆందోళన విరమించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.

More Telugu News