డబ్బు పంపకాల్లో హిజ్రాల మధ్య గొడవ.. చితక్కొట్టేసిన పోలీసులు.. వెల్లువెత్తుతున్న విమర్శలు

  • డబ్బుల పంపకంలో తేడాలు
  • నడిరోడ్డుపై కొట్టుకున్న హిజ్రాలు
  • పోలీస్ స్టేషన్‌లో పరిగెత్తించి కొట్టిన పోలీసులు
డబ్బుల పంపకంలో తేడాలతో రెండు వర్గాలుగా విడిపోయిన హిజ్రాలు గొడవకు దిగి కొట్టుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్ది పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ హిజ్రాల మధ్య మరోమారు గొడవ జరగడంతో పోలీసులు రెచ్చిపోయారు. లాఠీలతో నిర్దాక్షిణ్యంగా వారిని చావబాదారు. పరిగెత్తించి మరీ కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హిజ్రాలపై పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ సమీపంలోని లాల్‌కుర్తి పోలీస్‌స్టేషన్‌లో జరిగిందీ ఘటన. హిజ్రాలను చావబాదిన విషయం వైరల్ కావడంతో పోలీసు అధికారి స్పందించారు. పోలీస్ స్టేషన్‌లో హిజ్రాలు అసభ్యంగా ప్రవర్తించారని, వారిని అదుపు చేసేందుకే లాఠీచార్జ్ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు ఎస్సెస్పీ నితిన్‌ తివారీ తెలిపారు.
Go Back to Shorts
Transgenders
police
Meerut
Uttar Pradesh

More Telugu News