ఏపీ గవర్నర్‌గా సుష్మాస్వరాజ్ అంటూ వార్తలు.. నిజం కాదన్న సీనియర్ నేత!
- తెలుగు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లు అంటూ ప్రచారం
- సుష్మకు అభినందనలు చెప్పి నాలుక్కరుచుకున్న కేంద్రమంత్రి
- ఆ వార్తల్లో నిజం లేదన్న సుష్మ
రాత్రి పదిగంటలకు కేంద్రమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఓ ట్వీట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన సుష్మాస్వరాజ్‌కు అభినందనలు అని పేర్కొన్నారు. దీంతో ఈ వార్తకు మరింత బలం చేకూరింది. అయితే, ఆ తర్వాత కాసేపటికే మంత్రి తన ట్వీట్‌ను డిలీట్ చేశారు. మరోపక్క, తాను ఏపీ గవర్నర్‌గా నియమితులైనట్టు వచ్చిన వార్తలపై సుష్మ స్వయంగా స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని కొట్టిపడేశారు.