Andhra Pradesh: ముగిసిన ఏపీ కేబినెట్ తొలి భేటీ

  • దాదాపు ఐదున్నర గంటల పాటు జరిగిన సమావేశం
  • కీలక అంశాలపై చర్చ..వివిధ పథకాలకు ఆమోదం
  • ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి కేబినెట్ సుముఖత

ఏపీ కేబినెట్ తొలి భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఏపీ సచివాలయంలో నిర్వహించిన ఈ భేటీ దాదాపు ఐదున్నర గంటల పాటు జరిగింది. సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రభుత్వ ప్రాధాన్యతల గురించి మంత్రులకు జగన్ వివరించారు.  వివిధ పథకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆశా వర్కర్ల జీతం రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచేందుకు, ప్రభుత్వ ఉద్యోగుల ఐఆర్ చెల్లింపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కేబినెట్ సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇందుకుగాను ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అక్టోబర్ 15 నుంచి ‘రైతు భరోసా’ అమలుకు ఏర్పాట్లు చేయాలని జగన్ ఆదేశించినట్లు సమాచారం.

More Telugu News