కోతలు కోసిన చంద్రబాబు ఇప్పుడు మౌనీ బాబా అయ్యారు: విజయసాయిరెడ్డి
Add ap7am to your home Screen

కోతలు కోసిన చంద్రబాబు ఇప్పుడు మౌనీ బాబా అయ్యారు: విజయసాయిరెడ్డి

  • బీసీలను, కాపులను ఉద్ధరిస్తానని బాబు చెప్పారు
  • ఇప్పుడు జగన్ క్యాబినెట్ కూర్పు చూసి ఏం మాట్లాడలేకపోతున్నారు
  • ట్వీట్ చేసిన విజయసాయి
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైసీపీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికల వేళ చంద్రబాబు ఎన్నో ఉచిత వాగ్దానాలు చేశారని, బీసీలను, కాపులను అందలం ఎక్కిస్తానని హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. ఓట్ల కోసం కోతలు కోసిన చంద్రబాబు ఇప్పుడు జగన్ గారి మంత్రివర్గ కూర్పుపై కనీసం ఒక్క ముక్క కూడా మాట్లాడడంలేదని విమర్శించారు. సామాజికంగా అణచివేతకు గురైన వర్గాలకు జగన్ నాలుగు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వడంపై చంద్రబాబు ఏ వ్యాఖ్య చేయలేక మౌనీ బాబా అయ్యారని విజయసాయి ఎద్దేవా చేశారు.
Chandrababu
Vijay Sai Reddy

More Telugu News