పోడు భూములతోపాటు భూ ప్రక్షాళనలోని లోపాలపై ఉద్యమాలు: చాడ వెంకటరెడ్డి
- 19, 20 తేదీల్లో ప్రాజెక్టుల సందర్శన
- రెండోసారి అధికారం చేపట్టాక పాలన గాడి తప్పింది
- కాళేశ్వరం, ప్రాణహిత, తుమ్మిడిహట్టిల పరిశీలన
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాగునీటి ప్రాజెక్టుల సందర్శనను ఈనెల 19, 20 తేదీల్లో రాష్ట్ర ప్రతినిధి బృందం ఆధ్వర్యంలో చేపట్టాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ప్రధానంగా కాళేశ్వరం, ప్రాణహిత, తుమ్మిడిహట్టి ప్రాజెక్టులను పరిశీలించనున్నట్టు పేర్కొన్నారు. రెండోసారి కేసీఆర్ అధికారం చేపట్టాక రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని చాడ విమర్శించారు.