Rajinikanth: తమిళనాట పాఠ్యాంశంగా రజనీకాంత్ జీవితం

  • ఐదో తరగతి పుస్తకాల్లో రజనీకాంత్ ప్రస్థానం
  • తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం
  • కండక్టర్ స్థాయి నుంచి సూపర్ స్టార్ గా ఎదిగిన రజనీ
తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సాధారణ బస్ కండక్టర్ గా జీవన ప్రస్థానం మొదలుపెట్టి కోట్లాదిమంది తమిళులకు ఆరాధ్యదైవంగా ఎదిగిన రజనీ యుగపురుషుడు అని చెప్పాలి. ఇప్పుడాయన జీవితం తమిళనాడులో పాఠ్యాంశంగా రానుంది. ఐదో తరగతి పాఠ్యపుస్తకాల్లో రజనీకాంత్ ప్రస్థానాన్ని ఓ పాఠంగా చేర్చాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది.

స్వయంకృషితో పైకొచ్చిన ప్రముఖులు అనే పాఠంలో రజనీకాంత్ జీవితాన్ని కూడా ప్రస్తావించనున్నారు. జన్మతః తమిళుడు కాకపోయినా, రజనీ కేవలం స్టయిల్ తోనే అభిమానుల మనసుల్లో చెరగని స్థానం సంపాదించారు. మాస్ సినిమాల్లో ఎక్కువగా నటించినా క్లాస్ అభిమానులకు కూడా దగ్గరవడం రజనీకి మాత్రమే సాధ్యమైంది.
Rajinikanth

More Telugu News