Diamonds: వర్షాలు పడుతున్నాయ్ మరి... కార్లలో వచ్చి మరీ వజ్రాల వేట!

  • సీమలోని కొన్ని ప్రాంతాల్లో వజ్రాలు
  • రాత్రిళ్లు హోటళ్లలో బస, పగలు వజ్రాన్వేషణ
  • అనంతపురం జిల్లాకు తరలివస్తున్న అన్వేషకులు
తొలకరి జల్లులు మొదలవగానే, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో వజ్రాలు బయట పడతాయన్న సంగతి తెలిసిందే. పలువురికి ఇవి దొరికాయి కూడా. ఈ సంవత్సరం వజ్రాల కోసం తుగ్గలి పరిసర ప్రాంతాలకు సుదూరాల నుంచి అన్వేషకులు వస్తుండటం గమనార్హం. అదృష్టం ఉంటే రాత్రికి రాత్రే లక్షాధికారులం కావచ్చన్నది వీరి ఆలోచన. ఇక, కొందరు కార్లలో వచ్చి రాత్రంతా గుత్తిలోని లాడ్జీల్లో బస చేసి, తెల్లారగానే, పొలాల్లోకి వచ్చి వజ్రాల కోసం వెతుకుతున్నారు. కర్నూలు, కడప జిల్లాల నుంచే కాకుండా గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి కర్ణాటక నుంచి కూడా అనంతపురం జిల్లాకు అన్వేషకులు వస్తుండటం విశేషం.
Diamonds
Rayalaseema
Tuggali

More Telugu News