CM jagan tour schedule: మధ్యాహ్నం 3.45 గంటకు రేణిగుంటకు ముఖ్యమంత్రి: జగన్ టూర్ షెడ్యూల్ ఇదే
- ప్రధానికి స్వాగతం పలికాక ఆయనతోపాటు తిరుమలకు
- రాత్రి 8 గంటలకు తిరిగి రేణిగుంట విమానాశ్రయానికి
- పీఎం, సీఎం పర్యటనతో భారీ భద్రత
ప్రధాని నరేంద్రమోదీ తిరుమల పర్యటన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈ రోజు తిరుపతి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3.45 గంటలకు ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీకి స్వాగతం పలికాక ఆయనతోపాటు రోడ్డు మార్గంలో తిరుమల చేరుకుంటారు. ప్రధాని తిరుమల శ్రీవారి దర్శనం పూర్తయ్యాక తిరిగి ఆయనతో పాటు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. ప్రధానికి వీడ్కోలు పలికిన అనంతరం విజయవాడకు ప్రయాణమవుతారు.
కాగా, ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి జగన్ పర్యటన ఒకేసారి కావడంతో పోలీసులు తిరుపతిలో భారీభద్రతా ఏర్పాట్లుచేశారు. రేణిగుంట నుంచి తిరుమల వరకు మూడువేల మంది పోలీసులతో పహారా ఏర్పాటు చేశారు. రేణిగుంట నుంచి తిరుమలకు నిన్ననే ట్రయిల్ రన్ కూడా పూర్తి చేశారు. వీరిరువురూ ప్రయాణించే మార్గాల్లో అణువణువూ తనిఖీ చేస్తున్నారు.