TTD: కిటకిటలాడుతున్న తిరుమల... బయట 2 కి.మీ. క్యూలైన్!

  • నాలుగు రోజుల్లో ముగియనున్న సెలవులు
  • నిండిన అన్ని కంపార్టుమెంట్లూ
  • భక్తులు సహకరించాలన్న టీటీడీ

తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో ఏడు కొండలూ కిటకిటలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల్లో విద్యార్థుల వేసవి సెలవులు ముగియనుండటమే భక్తుల రద్దీ విపరీతంగా పెరగడానికి కారణమని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. శనివారం సాయంత్రం నుంచి వేలకొద్దీ భక్తులు కొండపైకి రావడంతో, ఈ ఉదయం వైకుంఠంలోని కంపార్ట్‌ మెంట్లు అన్నీ నిండి వెలుపల 2 కిలోమీటర్ల మేరకు క్యూలైన్ సాగింది. సర్వదర్శనానికి వచ్చే భక్తులకు స్వామి దర్శనానికి 26 గంటల సమయం పడుతోందని, భక్తులు ఓపికతో సహకరించాలని అధికారులు కోరారు.

నేడు ప్రధానితో పాటు గవర్నర్, ఏపీ సీఎం తిరుమలకు రానుండటంతో, సాయంత్రం 6 గంటల తరువాత దాదాపు గంటపాటు సర్వ, ప్రత్యేక ప్రవేశ దర్శనాలను నిలిపివేయనున్నట్టు అధికారులు తెలిపారు. కాగా, శనివారం నాడు 98,044 మంది భక్తులు స్వామిని దర్శించుకోగా, 60,478 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ. 3.20 కోట్లని అధికారులు తెలిపారు.

More Telugu News