Uttam Kumar Reddy: కేసీఆర్ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • సీఎంపై ధ్వజమెత్తిన కాంగ్రెస్ నేత
  • కేసీఆర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు
  • స్పీకర్ వైఖరి పట్ల అనుమానాలు కలుగుతున్నాయి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విపక్ష నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి పట్ల విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

ఉన్నతస్థాయి రాజ్యాంగ పదవులలో వున్న వ్యక్తులు కేసీఆర్ పాలనలో రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. వరస చూస్తుంటే గౌరవనీయ స్పీకర్ వ్యవహార శైలిపైనా అనుమానాలు కలుగుతున్నాయని, విపక్షాల వాదనలను ఉద్దేశపూర్వకంగా కొన్ని వారాల పాటు పట్టించుకోకుండా పక్షపాత ధోరణితో వ్యవహరించినట్టు అర్థమవుతోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
Uttam Kumar Reddy
Congress

More Telugu News