Andhra Pradesh: సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా పనిచేసేందుకు మేమంతా సిద్ధం!: ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం

  • ఏపీలో ప్రతిభావంతులైన అధికారులున్నారు
  • సవాళ్లను దీటుగా ఎదుర్కొని పనిచేస్తాం
  • మీడియాతో మాట్లాడిన ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయడానికి అధికారులంతా సిద్ధంగా ఉన్నారని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఏపీలో అత్యంత ప్రతిభావంతులైన అధికారులు ఉన్నారని వ్యాఖ్యానించారు. సవాళ్లను దీటుగా ఎదుర్కొని ఉత్తమ పనితీరును కనబర్చేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు.

ఏపీ సచివాలయంలో ఈరోజు సీఎస్ మీడియాతో మాట్లాడారు. మరికాసేపట్లో జగన్ మంత్రివర్గంలో 25 మంది మంత్రులు నేడు అమరావతిలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పలువురు అధికారులు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్ఛాలు అందించారు.
Andhra Pradesh
Jagan
Chief Minister
lv subrmanyam

More Telugu News