jagan: సీబీఐ ఏపీకి వస్తే అభ్యంతరం ఎందుకు?: జగన్

  • అధికారుల సామర్థ్యంపై నాకు పూర్తి నమ్మకం ఉంది
  • అవినీతికి తావు లేని పాలన అందిద్దాం
  • ప్రజల ఆకాంక్షల మేరకు పని చేద్దాం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంతో నమ్మకంతో తమ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అధికారులు పూర్తిగా సహకరిస్తే... ప్రభుత్వ, ప్రజలు కలలు సాకారమవుతాయని చెప్పారు. అధికారుల సామర్థ్యంపై తనకు పూర్తి నమ్మకం, విశ్వాసం వున్నాయని అన్నారు. అవినీతికి తావు లేని పారదర్శకమైన పాలనను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలని సూచించారు. సమర్థవంతంగా పని చేసే అధికారులను సన్మానిస్తామని చెప్పారు. అధికారులంతా ఒక కుటుంబంలా పని చేయాలని అన్నారు. అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలతో సమావేశం సందర్భంగా జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఏపీ రాష్ట్ర పాలన దేశానికే మార్గదర్శకంగా ఉండాలని జగన్ అన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసినప్పుడు కూడా తాను ఇదే విషయాన్ని ఆయనతో చెప్పానని తెలిపారు. ప్రభుత్వం చేపట్టే పనులను జ్యుడీషియల్ కమిషన్ ముందు పెడతామని... పనులకు సంబంధించి న్యాయపరమైన నిర్ణయాన్ని కమిషన్ తీసుకోవాలని కోరానని చెప్పారు. రాష్ట్రంలో అడుగుపెట్టకుండా సీబీఐని ఎందుకు అడ్డుకోవాలని ప్రశ్నించారు. సీబీఐ రాకపై అభ్యంతరం ఎందుకని అన్నారు.

ప్రజల ఆకాంక్షల మేరకు పని చేద్దామని జగన్ సూచించారు. గ్రామ వాలంటీర్లు గ్రామ సచివాలయం కేంద్రంగా పని చేస్తారని చెప్పారు. అర్హులందరికీ పథకాలు, ప్రయోజనాలు అందాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. ప్రజలకు పాలనను చేరువ చేస్తామని ప్రకటించారు. 
jagan
ysrcp

More Telugu News