Bollywood: సల్మాన్ భాయ్ లోని కొత్త కోణాన్ని త్వరలో చూపించబోతున్నాం: ఉపాసన

  • అపోలో గ్రూప్ నకు చెందిన మేగజైన్ ‘బి పాజిటివ్’
  • ఈ మేగజైన్ వ్యవహారాలు చూస్తున్న ఉపాసన 
  • సల్మాన్ ని ఇంటర్వ్యూ చేశానంటూ ఉపాసన ట్వీట్

అపోలో గ్రూప్ నకు చెందిన మేగజైన్ ‘బి పాజిటివ్’. ప్రముఖుల ఆరోగ్య రహస్యాలు, వారు తీసుకునే ఆహారం, ఫిట్ నెస్ కోసం వారు తీసుకునే జాగ్రత్తల గురించి ఈ మేగజైన్ లో ప్రచురితమవుతుంటాయి. తాజాగా, ఈ మేగజైన్ కోసం బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ చేసింది మరెవరో కాదు! ప్రముఖ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన. ఈ మేగజైన్ వ్యవహారాలను పర్యవేక్షించే ఉపాసన ఈ విషయాన్ని తనే స్వయంగా తెలిపారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమోతో పాటు ఓ ట్వీట్ చేశారు. సల్మాన్ భాయ్ లోని కొత్త కోణాన్ని త్వరలో చూపించబోతున్నామని చెప్పిన ఉపాసన, కండలవీరుడికి ‘థ్యాంక్స్’ చెప్పారు.

More Telugu News