Revanth Reddy: 2016లో టీడీపీ విలీనానికి పాల్పడితే హైకోర్టులో సవాల్ చేశా: రేవంత్

  • కోర్టు ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు
  • విలీన ప్రక్రియ అనేది కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిది
  • స్పీకర్ పరిధిలో ఉండదు

2016లో టీడీపీకి సంబంధించిన 12 మంది ఎమ్మెల్యేలను విలీనం చేస్తూ బులెటెన్ ఇస్తే, దానిని తాను హైకోర్టులో సవాల్ చేశానని మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అప్పుడు 90 రోజుల్లో అనర్హత పిటిషన్లను పరిష్కరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ప్రస్తుతం కోర్టు ఆదేశాలను సైతం ఉల్లంఘిస్తూ ఇలాంటి ప్రక్రియలకు పాల్పడుతున్నట్టు తెలిపారు.

పార్టీ విలీన ప్రక్రియ అనేది కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి చేతుల్లో మాత్రమే ఉంటుందని.. స్పీకర్ పరిధిలో ఉండదని రేవంత్ స్పష్టం చేశారు. అసలు తన పరిధిలో లేని అధికారాలతో విలీన ప్రక్రియ చేపట్టడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను బెదిరించి విలీనానికి ఒత్తిడి తెచ్చారని, కేసీఆర్ ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే ప్రజలు హర్షించరని రేవంత్ పేర్కొన్నారు.

More Telugu News