Rambabu: వేధింపులకు నిరసనగా.. అత్తింటి ముందు ధర్నాకు దిగిన మహిళ

  • రాంబాబుకు, స్రవంతితో నాలుగేళ్ల క్రితం వివాహం
  • పెళ్లైన మూడు నెలల నుంచే మనస్పర్థలు
  • పెద్ద మనుషులు నచ్చజెప్పినా ఫలితం శూన్యం
అదనపు కట్నం కోసం అత్తింటి వారు తనను వేధిస్తున్నారంటూ ఓ మహిళ పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆమె అత్తింటి ఎదుట ఆందోళనకు దిగింది. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాలకు చెందిన రాంబాబుకు, నందిగామ మండలం అంబరుపేటకు చెందిన స్రవంతితో నాలుగేళ్ల క్రితం వివాహమైంది.

పెళ్లైన మూడు నెలల నుంచే వీరిద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. దీంతో పంచాయితీ పెట్టగా పెద్ద మనుషులు ఇద్దరికీ సర్ది చెప్పారు. అయినా ఫలితం శూన్యం. అదనపు కట్నం తెమ్మంటూ, తనను అత్తింటి వారు వేధింపులకు గురి చేస్తున్నారంటూ స్రవంతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రాంబాబుకు కౌన్సెలింగ్ చేశారు. అయినా మార్పు రాకపోవడంతో అత్తింటి ఎదుట స్రవంతి న్యాయపోరాటానికి దిగింది.
Rambabu
Sravanthi
Nandigama
Kanchikacharla
Krishna District
Police

More Telugu News