Odisha: ఒడిశాలో అధికారితో గుంజీలు తీయించిన బీజేడీ ఎమ్మెల్యే!

షార్ట్స్‌లో చూడండి
ఒడిశాలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన బీజేడీ నేత సరోజ్ కుమార్ మెహెర్ వివాదాస్పద చర్యలకు పాల్పడ్డారు. పాట్నాగఢ్ నియోజకవర్గానికి ఆయన నేతృత్వం వహిస్తున్నారు. తన నియోజకవర్గ పర్యటన సందర్భంగా పలు గ్రామాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల నాణ్యతలేని రోడ్లను ఆయన గుర్తించారు. రోడ్లలో నాణ్యత లేదంటూ సంబంధిత జూనియర్ ఇంజనీర్ పై సరోజ్ కుమార్ మండిపడటమే కాకుండా, ఆ ఇంజనీర్ తో గుంజీలు తీయించి, ప్రజలకు క్షమాపణలు చెప్పించారు. తాను చెప్పినట్టు నడచుకోకపోతే హింసకు కూడా వెనుకాడనని ఆ ఇంజనీర్ ను సరోజ్ కుమార్ బెదిరించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చేరి వైరల్ గా మారింది. 
Go Back to Shorts
Odisha
bjd
saroj kumar
patna ghar

More Telugu News