Vijay Sai Reddy: చంద్రబాబులో తన లగ్జరీ హౌస్ ఉంటుందా? పోతుందా? అన్న సంశయం కనిపిస్తోంది: విజయసాయి రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
మాజీ సీఎం చంద్రబాబు రాసే తొలి లేఖ ప్రజా సమస్యలపై ఉంటుందని భావించానని, అయితే, ఆయన తన విలాసవంతమైన భవనం ఉంటుందా? పోతుందా? అన్న సంశయంలో ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.

 ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "సిఎం జగన్ గారికి చంద్రబాబు రాసే మొదటి లేఖ ప్రజా సమస్యల పైన ఉంటుందనుకున్నాం. 40 ఏళ్ల అనుభవానికి తను ఉండే విలాసవంతమైన నివాసం ఉంటుందా,  పోతుందా అనే సంశయం తప్ప ఇంకేమీ కనిపించడం లేనట్టుంది. ప్రపంచం మొత్తాన్ని అమరావతికి రప్పిస్తా అన్న వ్యక్తికి సొంత ఇల్లు కట్టుకునే ఆలోచన లేనట్టేగా?" అని ట్వీట్ చేశారు. 
Go Back to Shorts
Vijay Sai Reddy
Chandrababu
Twitter

More Telugu News