కశ్మీర్లో రెచ్చిపోయిన అల్లరిమూకలు.. వృద్ధురాలికి అండగా నిలిచిన జవాను.. ప్రశంసల జల్లు కురిపిస్తున్న నెటిజన్లు!
- రాళ్ల దాడికి తెగబడిన అల్లరిమూకలు
- గందరగోళంలో పడిపోయిన వృద్ధురాలు
- సాయం కోసం అర్థిస్తూ కేకలు
- సురక్షితంగా బ్రిడ్జి దాటించిన జవాను
ఆమె బాధను ఆలకించిన ఓ జవాను ఆమెకు అండగా నిలిచి సురక్షితంగా బ్రిడ్జి దాటించాడు. తన ప్రాణాలు కాపాడిన జవానుకు వృద్ధురాలు ధన్యవాదాలు తెలిపింది. దీనికి సంబంధించిన ఫోటోలను జమ్మూకశ్మీర్ ప్రభుత్వ యంత్రాంగం విడుదల చేసింది. ఇప్పుడు ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. మరోసారి భారత జవానుల ఔన్నత్యాన్ని మెచ్చుకుంటూ నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.