క్రికెట్ అభిమానుల కోసం జియో బంపర్ ఆఫర్

Wed, Jun 05, 2019, 04:12 PM
  • స్పెషల్ డేటా ప్యాక్ రూ.251 ప్రకటన
  • రోజుకి 2 జీబీ చొప్పున 102 జీబీ డేటా లభ్యం
  • హాట్‌ స్టార్‌ లో లైవ్ క్రికెట్ చూసే అవకాశం
రిలయన్స్ జియో యూజర్లకి శుభవార్త. క్రికెట్ అభిమానుల కోసం రిలయన్స్ జియో తాజాగా బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019 మ్యాచులను ఉచితంగా చూసే అవకాశం లభిస్తుంది. ఈ మ్యాచులను చూసేందుకు క్రికెట్ సీజన్ స్పెషల్ డేటా ప్యాక్ రూ.251 రీఛార్జి చేసుకోవాలి. ఈ రీఛార్జి ప్రకారం 51 రోజుల పాటు రోజుకి 2 జీబీ చొప్పున 102 జీబీ హైస్పీడ్ డేటాను పొందుతారు. దీనితో పాటు జియో వినియోగదారులు రూ.365 విలువైన ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఈ ఆఫర్ ద్వారా జియో టీవీ యాప్ నుండి హాట్‌ స్టార్‌లో లైవ్ క్రికెట్ చూసే అవకాశం ఉంటుంది. అలాగే, మ్యాచులు జరుగుతున్నంతకాలం జియో పోటీలను నిర్వహిస్తుంది. ఈ పోటీలలో గెలుపొందితే ప్రత్యేక బహుమతులు కూడా లభిస్తాయి.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement