విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో కైరా అద్వాని
- బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కైరా అద్వాని
- తెలుగు .. తమిళ భాషల్లోను క్రేజ్
- శివకార్తికేయన్ జోడీగా ఛాన్స్
తెలుగులో 'వినయ విధేయ రామ' సినిమాలో గ్లామర్ పరంగా కుర్రకారు మతులు పోగొట్టిన కైరా అద్వాని, తమిళంలోనూ తన జోరు చూపించడానికి రంగాన్ని సిద్ధం చేసుకుంటోంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే తమిళంలో ఒక ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. నయనతార ప్రేమికుడు విఘ్నేశ్ శివన్ తమిళంలో శివకార్తికేయన్ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా కైరా అద్వానిని ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దర్శక నిర్మాతలు అధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరించవలసి వుంది.