Jaggareddy: పాతికమంది టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఉన్నా ఒకటే, మా జీవన్ రెడ్డి ఒక్కడున్నా ఒకటే: జగ్గారెడ్డి

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేక ఫలితాలు రావడం పట్ల సీనియర్ రాజకీయవేత్త, ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. 'శాసనమండలిలో 25 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఉన్నా ఒకటే, మా జీవన్ రెడ్డి ఒక్కడున్నా ఒకటే'నని అన్నారు. ప్రత్యర్థులు ఎంతమంది ఉన్నా సమర్థంగా ఎదుర్కోగల సత్తా జీవన్ రెడ్డికి ఉందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

ఇక, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి ఓటమిపైనా ఆయన మాట్లాడారు. కోమటిరెడ్డి బ్రదర్స్ వద్ద డబ్బు లేకపోవడం వల్లే ఎన్నికల్లో ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చిందని అభిప్రాయపడ్డారు. డబ్బు ఉంటే కోమటిరెడ్డి బ్రదర్స్ గెలిచేవారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదని, ఎప్పుడూ అధికార పక్షానికి అనుకూలంగానే ఫలితాలు వస్తాయని వ్యాఖ్యానించారు.
Jaggareddy
TRS
Congress

More Telugu News