Supreme Court: రవిప్రకాశ్ కు చుక్కెదురు.. బెయిల్ కోసం హైకోర్టుకే వెళ్లమన్న సుప్రీం

  • రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంలో విచారణ
  • హైకోర్టుకు ఆదేశాలు జారీచేసిన సుప్రీం
  • విచారణకు హాజరుకావాలంటూ రవిప్రకాశ్ కు స్పష్టీకరణ

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే, ముందస్తు బెయిల్ కోసం రవిప్రకాశ్ తిరిగి హైకోర్టుకే వెళ్లాలని సుప్రీం సూచించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ పై మెరిట్ ఆధారంగా విచారణ జరపాలని ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ నెల 10న విచారణ జరిపి రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ పై నిర్ణయం తీసుకోవాలని దిగువకోర్టుకు స్పష్టం చేసింది. అంతేకాకుండా, 41ఏ నోటీసు కింద విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని అటు రవిప్రకాశ్ కు కూడా తేల్చిచెప్పింది. ఒకవేళ రవిప్రకాశ్ ను అరెస్ట్ చేయాలనుకుంటే 48 గంటల ముందు నోటీసులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, సుప్రీంకోర్టులో రవిప్రకాశ్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వి వాదనలు వినిపించారు.

More Telugu News