jd chakravarthi: జేడీ చక్రవర్తి ప్రధానపాత్రధారిగా వర్మ సినిమా

  • తెలుగు తెరకి జేడీని పరిచయం చేసిన వర్మ 
  • బాలీవుడ్ లోను వర్మ ఇచ్చిన ప్రోత్సాహమే 
  • ప్రస్తుతం కేరక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ  
రామ్ గోపాల్ వర్మ .. జేడీ చక్రవర్తికి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. 'శివ' సినిమా ద్వారా జేడీ చక్రవర్తిని పరిచయం చేసింది వర్మనే. అలాగే జేడీ చక్రవర్తిని బాలీవుడ్ కి నటుడిగాను .. దర్శకుడిగాను పరిచయం చేసింది కూడా వర్మనే. అలాంటి వర్మ .. మళ్లీ జేడీ చక్రవర్తితో ఒక సినిమా చేయడానికి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

ఈ సినిమాకి వర్మ నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తూ, దర్శకత్వ బాధ్యతలను వేరేవారికి అప్పగించనున్నాడు. ఇక మిగతా నటీనటులు .. సాంకేతిక నిపుణులు ఎవరనే విషయంలో త్వరలోనే స్పష్టత రానుంది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో కీలకమైన పాత్రలను చేస్తూ జేడీ చక్రవర్తి బిజీగా వున్నాడు. అలా ఆయన కీలకమైన పాత్రను పోషించిన 'హిప్పీ' ఈ నెల 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
jd chakravarthi

More Telugu News