Jagan: ఏపీ ఆశా వర్కర్లకు శుభవార్త.. వేతనాలను భారీగా పెంచిన సీఎం జగన్!

  • ఇకపై నెలకు రూ.10 వేలు వేతనం
  • ఇప్పటివరకు నెలకు రూ.3,000 అందుకున్న ఆశా వర్కర్లు
  • పాదయాత్రలో మాటిచ్చిన జగన్
ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే జగన్ ఎంతో వేగం ప్రదర్శిస్తున్నారు. ఓవైపు శాఖల పనితీరును అధ్యయనం చేస్తూనే, మరోవైపు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా, రాష్ట్రంలో ఆశా వర్కర్ల వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఆశా వర్కర్లకు నెలకు రూ.3 వేలు మాత్రమే ఇస్తుండగా, ఇకనుంచి నెలకు రూ.10 వేలు వేతనంగా ఇవ్వనున్నట్టు జగన్ సర్కారు ప్రకటించింది.

జగన్ తాను పాదయాత్ర నిర్వహిస్తున్న సమయంలోనే ఆశా వర్కర్ల వేతనాలపై మాటిచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వేతనం సమీక్షిస్తానని, కచ్చితంగా పెంచుతానని హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే మాట నిలబెట్టుకున్నారు.
Jagan

More Telugu News