తనకోసం వండిన ఆహారాన్ని అధికారులతో పంచుకోవడం జగన్ సంస్కారాన్ని చాటుతోంది: విజయసాయిరెడ్డి

  • సమీక్షల కోసం వచ్చే అధికారుల లంచ్ జగన్ గారింట్లోనే
  • ఏ విషయమైనా గంటల్లోనే తేల్చేస్తున్నారు
  • జగన్ సమీక్షల పట్ల అధికారులు సంతృప్తిగా ఉన్నారు
ఏపీ నూతన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. జగన్ గారు సమీక్షలు నిర్వహిస్తున్న తీరును అధికారులే మెచ్చుకుంటున్నారని, ఎంతటి క్లిష్టమైన సమస్య అయినా కాలయాపన లేకుండా గంటల్లోనే తేల్చేస్తున్నారని కితాబునిచ్చారు.

ఇక సమీక్షల కోసం వస్తున్న అధికారుల మధ్యాహ్న భోజనం ముఖ్యమంత్రి గారి నివాసంలోనే ఏర్పాటు చేస్తున్నారని, తన కోసం వండిందే అధికారులకు కూడా పెట్టాలని జగన్ గారు సూచిస్తున్నారని విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఓ సీఎం అధికారులతో భోజనాన్ని పంచుకోవడం ఆయన సంస్కారానికి నిదర్శనం అని ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Jagan
Vijay Sai Reddy
Andhra Pradesh
YSRCP

More Telugu News