TRS: స్థానిక సంస్థల ఎన్నికలు... నల్గొండ, వరంగల్ టీఆర్ఎస్ కైవసం

  • సత్తా చాటిన టీఆర్ఎస్
  • నల్గొండలో గెలిచిన తేరా చిన్నపరెడ్డి
  • వరంగల్ లో పోచంపల్లి ఘనవిజయం
తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. తొలి ఓట్లను లెక్కించే వేళ కాంగ్రెస్ ఆధిక్యాన్ని చూపినా, మిగతా ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు పుంజుకున్నారు. నల్గొండలో టీఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి, వరంగల్ లో టీఆర్ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గెలుపొందినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. వరంగల్ లో శ్రీనివాస్ రెడ్డికి 850 ఓట్లు రాగా, కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన వెంకట్రామిరెడ్డి 23 ఓట్లకు మాత్రమే పరిమితం కావడం గమనార్హం. ఇక నల్గొండలో తేరా చిన్నపరెడ్డిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి పోటీకి దిగి ఓటమి పాలయ్యారు. రంగారెడ్డి జిల్లా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇక్కడ మహేందర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారని తెలుస్తోంది.
TRS
Congress
Telangana
Local Body Elections

More Telugu News