USA: చర్చలకు వస్తే స్వాగతిస్తాం... పోరాడాలనుకుంటే మా సత్తా ఏంటో చూపిస్తాం: అమెరికాకు చైనా వార్నింగ్

  • చైనా ఉత్పత్తులపై భారీగా సుంకాలు పెంచిన ట్రంప్
  • దెబ్బతిన్న అమెరికా-చైనా వాణిజ్య సంబంధాలు
  • చర్చలకు చైనా సమ్మతి

వాణిజ్యపరమైన ప్రయోజనాలను కాపాడుకోవడంలో ఎవరికి వారే పట్టుదల ప్రదర్శిస్తున్న దేశాలు అమెరికా, చైనా. ఇటీవల ఈ రెండు అగ్రదేశాలు ఒకరి మార్కెట్లపై మరొకరు కఠిన ఆంక్షలు విధిస్తూ ప్రచ్ఛన్నయుద్ధానికి తెరలేపడం తెలిసిందే. చైనా ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీస్థాయిలో సుంకాలు పెంచేశారు. ఈ నేపథ్యంలో, చైనా రక్షణ మంత్రి వీ ఫెంఘే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 ప్రస్తుత వివాదాలపై అమెరికా చర్చలకు వస్తే ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, ఒకవేళ వాళ్లు తమతో ఘర్షణలను కోరుకుంటే మాత్రం తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. వాణిజ్యపరమైన ప్రతిష్టంభనలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నదే చైనా విధానమని, చైనా ఎప్పుడూ దౌర్జన్యం చేయదని ఫెంఘే అన్నారు. ప్రపంచ పెద్దన్నగా వ్యవహరించాలన్న ఆశ, ఆశయం చైనాకు ఏమాత్రం లేదని, అమెరికాను తోసిరాజని తాము ప్రపంచంపై గుత్తాధిపత్యం చెలాయించాలని కోరుకోవడంలేదని స్పష్టం చేశారు.

More Telugu News