Cricket: ఆసీస్ బౌలర్లతో కొనసాగుతున్న ఆఫ్ఘన్ పోరాటం

  • టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆఫ్ఘనిస్తాన్
  • డకౌట్ అయిన ఓపెనర్లు
  • ఆదుకున్న రహ్మత్ షా

ఐసీసీ వరల్డ్ కప్ లో నిన్న పాకిస్థాన్ దారుణంగా ఓడిపోగా, ఇవాళ శ్రీలంక సైతం అదేబాటలో నడిచింది. అయితే, చిన్న జట్టు అయినా ఆఫ్ఘనిస్తాన్ మాత్రం అసమాన పోరాటపటిమ కనబరుస్తోంది. బ్రిస్టల్ లో బలమైన ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆఫ్ఘన్ మొదట బ్యాటింగ్ తీసుకుంది. ఆఫ్ఘన్ ఓపెనర్లకు పదునైన స్టార్క్, కమ్మిన్స్ ల పేస్ బౌలింగ్ ను ఎదుర్కోవడం శక్తికి మించినపనైంది. కొత్తబంతితో నిప్పులు చెరిగిన ఆసీస్ పేస్ జోడీ ప్రత్యర్థి ఓపెనర్లను ఖాతా తెరవకుండానే తిప్పి పంపింది.

వన్ డౌన్ లో వచ్చిన రహ్మత్ షా కీలకమైన ఇన్నింగ్స్ ఆడి స్కోరును గాడిలో పెట్టాడు. షా 43 పరుగులు చేశాడు. అయితే, లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా రెండు వికెట్లు తీయడంతో ఆఫ్ఘన్ మళ్లీ కష్టాల్లో పడింది. ఈసారి కెప్టెన్ గుల్బదిన్ నాయబ్, నజీబుల్లా జాద్రాన్ జట్టును ఆదుకోవడంతో 31 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. నాయబ్ 24, జాద్రాన్ 42 పరుగులతో క్రీజులో ఉన్నారు.

More Telugu News