Andhra Pradesh: టీడీపీ నేత సుజనా చౌదరిపై మళ్లీ సీబీఐ దాడులు!

  • హైదరాబాద్ లోని నివాసాల్లో తనిఖీలు
  • బ్యాంకులను రూ.6 వేల కోట్లు మోసం చేశారని ఆరోపణలు
  • ఇప్పటికే పలుమార్లు తనిఖీలు చేపట్టిన ఈడీ, ఐటీ, సీబీఐ

టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఈరోజు దాడులు నిర్వహించింది. హైదరాబాద్ లోని సుజనాకు చెందిన మూడు నివాసాలకు చేరుకున్న సీబీఐ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. సుజనా చౌదరి బ్యాంకులకు దాదాపు  రూ.6,000 కోట్లు ఎగ్గొట్టారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీబీఐ దాడులు నిర్వహించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

2018-19 మధ్యకాలంలో సీబీఐ, ఈడీ, ఐటీ అధికారులు తెలంగాణతో పాటు ఏపీలోని ఆయన నివాసాలు, కార్యాలయాల్లో పలుమార్లు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అప్పట్లో సుజన ఆఫీసు, కార్యాలయాల్లో పలు కీలకపత్రాలు, కంప్యూటర్ హార్డ్ డ్రైవ్ లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా సీబీఐ దాడులపై సుజనా చౌదరి ఇంతవరకూ స్పందించలేదు.

More Telugu News