తూర్పుగోదావరిలో దారుణం.. ఇద్దరు పిల్లలను చంపి, స్కూలులోని చెక్కపెట్టెలో పెట్టిన దుండగులు!
- జిల్లాలోని చెన్నయ్యపాలెంలో ఘటన
- స్కూల్ లో దుర్గంధం.. పోలీసులకు సమాచారం
- వారంరోజుల క్రితం మాయమైన అబ్బాయిలు
అయితే ఎంత వెతికినా పిల్లలజాడ తెలియరాలేదు. ఈ నేపథ్యంలో ఊరిచెరువు దగ్గరున్న పాఠశాలలో ఈరోజు దుర్గంధం రావడం ప్రారంభమైంది. దీంతో రైతులు పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీస్ అధికారులు స్కూల్ లోని ఓ చెక్క పెట్టెను తెరిచిచూడగా, ఇద్దరు పిల్లల మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో లభ్యమయ్యాయి. వీరిని తప్పిపోయిన కార్తీక్, ప్రశాంత్ లుగా గుర్తించారు. ఎవరో వీరిని చంపేసి చెక్కపెట్టెలో పెట్టినట్టు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.