పవన్ కల్యాణ్ పై పరోక్ష విమర్శలు గుప్పించిన విజయసాయిరెడ్డి!
Add ap7am to your home Screen

పవన్ కల్యాణ్ పై పరోక్ష విమర్శలు గుప్పించిన విజయసాయిరెడ్డి!

  • వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పెన్షన్లను భారీగా పెంచాం
  • కిడ్నీబాధితుల సమస్యలను కొందరు రాజకీయాలకు వాడుకున్నారు
  • వారంతా సిగ్గుపడాలన్న వైసీపీ సీనియర్ నేత
వైఎస్ జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పెన్షన్లను భారీగా పెంచి చరిత్ర సృష్టించిందని వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉద్ధానం కిడ్నీ బాధితుల విషయంలో వ్యవహరించిన తీరుపై పరోక్ష విమర్శలు గుప్పించారు.

కిడ్నీ బాధితుల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నవారంతా సిగ్గుపడాలని విమర్శించారు. కిడ్నీ బాధితులకు యువ ముఖ్యమంత్రి జగన్ ‘నేను చూశాను.. నేను ఉన్నాను’ అంటూ నెలకు రూ.10,000 అందజేస్తున్నారని ప్రశంసించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Andhra Pradesh
Pawan Kalyan
Jana Sena
Vijay Sai Reddy
YSRCP
udhanam

More Telugu News