సీఎం జగన్ పై గంటా శ్రీనివాసరావు విమర్శలు
- నవరత్నాల హామీ నుంచి తప్పించుకుంటున్నారు
- పెన్షన్ ను రూ. 3వేలకు పెంచుతామన్న హామీని తుంగలో తొక్కారు
- మధ్యపాన నిషేధంపై మాట తప్పారు
ప్రధాని మోదీని కలిసిన తర్వాత ప్రత్యేక హోదాపై జగన్ స్పష్టంగా మాట్లాడలేకపోతున్నారని... డొంకతిరుగుడుగా మాట్లాడుతున్నారని గంటా అన్నారు. టెండర్లను రద్దు చేస్తామంటూ, గత ప్రభుత్వంపై కక్ష సాధింపులకు దిగేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. పెన్షన్ ను రూ. 3వేలకు పెంచుతామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని... రూ. 250 మాత్రమే పెంచి, రూ. 2,250కి పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. మద్య నిషేధంపై కూడా మాట తప్పారని దుయ్యబట్టారు. గెలుపు, ఓటములు టీడీపీకి కొత్త కాదని... తిరిగి ప్రజల మద్దతును పొందుతామని తెలిపారు.