Rajinikanth: మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి భార్యతో కలిసి హాజరైన రజనీకాంత్
నరేంద్ర మోదీ మరోసారి ప్రధానిగా పదవీప్రమాణం చేయనున్న వేళ ఢిల్లీలో తారాతోరణం కొలువైంది. రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులతో పాటు సినీ తారలతో రాష్ట్రపతి భవన్ పరిసరాలు కళకళలాడిపోతున్నాయి. దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ కార్యక్రమంలో కనిపించారు. రజనీ తన అర్ధాంగి లతతో కలిసి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఇతర ప్రముఖులతో మాట్లాడుతూ రజనీకాంత్ ఉత్సాహంగా దర్శనమిచ్చారు.