chandrababu: శాసన సభ్యత్వానికి చంద్రబాబు రాజీనామా వార్తలు అవాస్తవం: వ్యక్తిగత కార్యదర్శి మనోహర్

  • కుప్పం నుంచి లోకేశ్ పోటీ చేస్తారని వస్తున్న వార్తల్లో నిజం లేదు
  • కుప్పంను చంద్రబాబు వదిలిపెట్టరు
  • జూన్ 2న కుప్పంలో చంద్రబాబు పర్యటిస్తారు
టీడీపీ అధినేత చంద్రబాబు జూన్ 2న కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారని ఆయన వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ తెలిపారు. ఎమ్మెల్యే పదవికి చంద్రబాబు రాజీనామా చేస్తారని, లోకేశ్ కుప్పం నుంచి పోటీ చేస్తారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు. చంద్రబాబు కుప్పం నియోజకవర్గాన్ని వదిలే ప్రసక్తే లేదని తెలిపారు.  కుప్పం పర్యటనలో పంచాయతీలవారీగా చంద్రబాబు పర్యటిస్తారని, తనను గెలిపించినందుకు ధన్యవాదాలు తెలుపుతారని వెల్లడించారు. తన వద్ద ఉన్న సమాచారం ఆధారంగా పార్టీ పరంగా ఎక్కడ ఎలాంటి మార్పులు చేయాలో ఒక అవగాహనకు వస్తారని తెలిపారు.
chandrababu
lokesh
kuppam

More Telugu News