Andhra Pradesh: జగన్ ముఖ్యమంత్రి కాగానే తొలి నియామకం.. ధనుంజయ్ రెడ్డికి కీలక పదవి!

  • సీఎం అదనపు కార్యదర్శిగా నియామకం
  • ప్రస్తుతం టూరిజం కార్పొరేషన్ ఎండీగా బాధ్యతలు
  • ఉత్తర్వులు జారీచేసిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఏపీ టూరిజం కార్పొరేషన్ ఎండీగా ఉన్న కె.ధనుంజయ్ రెడ్డిని ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీచేశారు.

జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక జరిగిన తొలి నియామకం ఇదే కావడం గమనార్హం. ధనుంజయ్ రెడ్డి గతంలో వ్యవసాయశాఖలో పనిచేశారు. శ్రీకాకుళం కలెక్టర్ గానూ బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ధనుంజయ్ రెడ్డి  జగన్ క్యాంపు ఆఫీసులో సేవలు అందిస్తున్నారు.  వైసీపీ అధినేత జగన్ ఈరోజు మధ్యాహ్నం 12.23 గంటలకు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
Andhra Pradesh
Jagan
YSRCP
dhanumjay reddy

More Telugu News